ఇప్పుడెందుకు ఆఫర్లు రావో చూస్తా

Aishwarya Rajesh ups the glam quotient
Thursday, July 23, 2020 - 12:30

ఈ ఫొటోలు చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఐశ్వర్య రాజేష్ చూపులో, పోజులో కూడా ఇదే మీనింగ్ కనిపిస్తుంది. అవును.. ఫస్ట్ టైమ్ అల్ట్రా గ్లామరస్ గా తయారైంది ఐశ్వర్య రాజేష్. ఆమె పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐశ్వర్య రాజేష్ అనగానే తెలుగు ప్రేక్షకులకు "వరల్డ్ ఫేమస్ లవర్", "కౌశల్య కృష్ణమూర్తి" సినిమాలే గుర్తొస్తాయి. ఈ రెండు సినిమాల్లో ఆమె డీ-గ్లామరైజ్డ్ రోల్స్ పోషించింది. మధ్యలో వచ్చిన "మిస్ మ్యాచ్" సినిమా అసలు డిస్కషన్ లోకే రాలేదు. దీంతో ఆమెకు గ్లామర్ పాత్రలు రావడం తగ్గిపోయాయి.

Latest Photos: Aishwarya Rajesh

సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఈ గ్లామరస్ స్టిల్స్ రిలీజ్ చేసింది ఐశ్వర్య. బంగారు రంగు దుస్తుల్లో, లేటెస్ట్ హెయిర్ స్టయిల్ తో రిలీజైన ఈ పిక్స్ చూస్తే.. కచ్చితంగా ఆమెకు రాబోయే రోజుల్లో గ్లామర్ పాత్రలు దక్కుతాయనే ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా.