అఖిల్ కూడా MCA చేస్తున్నాడు!

Akhil Akkineni is doing MCA
Friday, February 7, 2020 - 19:30

మొదటి సినిమాలో రిచ్ కిడ్ గా కనిపించాడు అఖిల్. రెండో సినిమా హలోలో కూడా పేద పిల్లాడిగా కనిపించినా, పెద్దయ్యేసరికి ధనవంతుడు అయిపోతాడు. ఇక మూడో సినిమా మిస్టర్ మజ్నులో బై-బర్త్ కోటీశ్వరుడు. ఇలా చేసిన 3 సినిమాల్లో సౌండ్ పార్టీగా కనిపించిన అఖిల్.. ఫస్ట్ టైమ్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా (MCA) కనిపించబోతున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నాడు అఖిల్. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉందంటోంది యూనిట్. అఖిల్ పెళ్లిచూపులకు, ఈ మిడిల్ క్లాస్ స్టేటస్ కు ఏదో లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

అఖిల్, హలో సినిమాలతో పోలిస్తే.. మిస్టర్ మజ్నులో ఫ్యామిలీ ఎమోషన్స్, అలాంటి సీన్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. తాజా చిత్రంలో కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి ప్రాముఖ్యతను తెలిపేలా.. నేటి తరం కుర్రాళ్లు పెళ్లిని ఎలా చూస్తున్నారనే కోణంలో ఈ సినిమా స్టోరీలైన్ సాగుతుంది. ఏప్రిల్ లో థియేటర్లలోకి వస్తున్నాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.