ఎలిజిబుల్ బ్యాచిలర్ కి వధువు కావలెను

Akhil film gets a title
Monday, February 3, 2020 - 11:00

అఖిల్ సినిమాకి ఎట్టకేలకి టైటిల్ దొరికింది. చాలా పేర్లు అనుకున్నారు మొత్తానికి ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయింది. మొదట ఈ సినిమాకి "లవ్లీ", "వధువు కావలెను" వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, ఇంగ్లీష్ పేరే క్యాచీగా ఉందని "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. 

ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ డైరెక్టర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా తీస్తున్నాడు. ఇంతకుముందు పక్కా తెలుగు పేర్లతో సినిమాలు తీసిన భాస్కర్ ఇప్పుడు ఇంగ్లీష్ టైటిల్ కి ఫిక్స్ అయ్యాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్. దాదాపు షూటింగ్ పూర్తి కావొస్తోంది. సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలనేది ప్లాన్. 

అఖిల్ కి ఇది నాలుగో మూవీ. ఇంతవరకు ఒక్క హిట్ లేదు. ఈ మూవీ తో కెరీర్ గాడిలో పడుతుంది అని ధీమాగా ఉన్నాడు జూనియర్ నాగ్.