అఖిల్ కెరియర్‌లో మలుపు!?

"హలో"తో తన కెరియర్ దశ, దిశ తిరుగుతుందనుకున్నాడు అఖిల్. కానీ అక్కినేని జూనియర్‌కి మళ్లీ లక్ కలిసిరాలేదు. వరుసగా రెండు ఫ్లాప్‌లతో అఖిల్ డీలాపడ్డాడు. ఒక మాస్ దర్శకుడితో, ఒక క్రియేటివ్ డైరక్టర్‌తో పనిచేసినా వర్క్ అవుట్ కాలేదు. దాంతో ఇపుడు కొత్త ఆలోచనలున్న యువ దర్శకులతో సినిమాలు చేద్దామనుకుంటున్నాడట.
రీసెంట్‌గా ఈ కుర్ర హీరో "మలుపు" సినిమా తీసిన దర్శకుడు సత్య పినిశెట్టి కథ విని నచ్చిందని చెప్పాడట. మరి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఇంతకీ సత్య పినిశెట్టి ఎవరో కాదు ఒకప్పటి ఫేమస్ డైరక్టర్ రవిరాజా పినిశెట్టి రెండో కుమారుడు. హీరో ఆది ఆయన బ్రదర్.
అఖిల్ కెరియర్ మలుపు తిరగాలంటే చాలా చేయాలి. ఆ ప్రయత్నంలో అతను మరో పొరపాటు చేస్తున్నాడా? అనే డౌట్ వస్తోంది. కానీ ఈ సారి దర్శకుడి స్టార్ స్టేటస్‌ని కాకుండా కథని నమ్మి ముందుకెల్దాం అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.
- Log in to post comments