షాక్‌లోనే ఉన్న క‌మ‌ల్ కూతురు

Akshara is silent on leaked pictures
Saturday, November 3, 2018 - 18:30

అక్షర హాసన్ కు సంబంధించిన హాట్ పిక్స్ నెట్ లో లీక్ అయ్యాయి. మొదట వీటిని చూసిన నెటిజన్లు, అక్షర‌ హాసన్ కు పిచ్చి పట్టిందా అని కామెంట్స్ చేశారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. ఇవి ఆమె వ్యక్తిగతంగా తీసుకున్న సెల్ఫీలు. ఎవరికీ షేర్ చేయని స్టిల్స్. అవి ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇన్నర్ వేర్ లో అక్షర హాసన్ తన బెడ్ రూమ్ లో తీసుకున్న సెల్ఫీలివి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సెల్ఫీలు లీక్ అయి సంచలనం సృష్టించాయి.గతంలో హీరోయిన్ ఎమీ జాక్సన్ విషయంలో కూడా ఇలానే జరిగింది. దీనిపై ఎమీ రియాక్ట్ అయింది కూడా. ఆ స్టిల్స్ ఎలా లీక్ అయ్యాయో తనకు అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసిన ఎమీ, లండన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

సరిగ్గా ఎమీకి జరిగినట్టే అక్షర హాసన్ కు కూడా జరిగి ఉండొచ్చు. ఆమె మొబైల్ ఫోన్ హ్యాకింగ్ కు గురై ఉండొచ్చు. అలా జరిగినప్పుడు ఇలాంటి ప్రైవేటు ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చేస్తాయి. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారంపై అక్షరహాసన్ సైలెంట్ గా ఉంది.