అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం

Akshay Kumar announces 25 cr to PM Fund
Saturday, March 28, 2020 - 18:00

కరోనా నేపథ్యంలో రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు ఇవ్వడంలో మన తెలుగు చిత్రసీమ ముందుంది. చిరంజీవి,  పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్, వెంకటేష్, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, రాజశేఖర్.... ఇలా అందరూ వరుసగా విరాళాలు అందచేశారు. ఇప్పుడు బాలీవుడ్ స్పందిస్తోంది. అయితే, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 25 కోట్ల భారీ విరాళం ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 

ప్రధాని మోడీ పీఎం -కేర్స్ అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, దాతలు విరాళాలు అందివ్వాలని కోరారు. వెంటనే అక్షయ్ కుమార్ స్పందించి... తనవంతుగా 25 కోట్ల భారీ మొత్తాన్ని ప్రకటించాడు. 

మన దేశంలో అత్యధికంగా సంపాదించే హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడు. సినిమాకి 70 కోట్ల పారితోషికం తీసుకుంటాడు.