అల్లు అర్జున్ కి రికార్డు వస్తోందిగా

Ala Vaikunthapurramlo gets record opening in USA
Friday, January 10, 2020 - 08:30

అల్లు అర్జున్ కి అమెరికాలో రికార్డు రానుంది. ఇది పర్సనల్ రికార్డు. అంటే... తన సినిమాల్లోనే పెద్ద ఓపెనింగ్ వస్తున్న రికార్డు ఇది. అమెరికాలో అల్లు అర్జున్ కాస్త వీక్. వరుణ్  తేజ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా 2 మిలియన్ డాల్లర్ల వసూళ్ళు అందుకున్నారు. కానీ బన్నీకి ఇప్పటివరకు అంత పెద్ద హిట్ అమెరికాలో దక్కలేదు. 'ఆల వైకుంఠపురంలో' తో ఆ ఛాన్స్ దక్కుతుందా అంటే చెప్పలేము కానీ ఓపెనింగ్ పరంగా మాత్రం అదరగొడుతున్నాడు. 

ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుంచే 400కే (నాలుగు లక్షల) డాలర్లు వచ్చేలా ఉంది. మహేష్ బాబు సినిమా పోటీలో ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రీమియర్ షో నెంబర్ రావడం అంటే మాటలు కాదు. త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్, థమన్ పాటల మేజిక్ ఈ సినిమాకి ఇంత క్రేజ్  రావడానికి కారణం. అల్లు అర్జున్ సినిమాల్లో అతనికి ఇది రికార్డు. 

ప్రస్తుతం తెలుగు సినిమాలకి అమెరికా మార్కెట్ పడిపోయింది. ఒకప్పుడు వచ్చిన కలెక్షన్లలో ఇప్పుడు సగం కూడా రావడం లేదు. ఇలాంటి సీన్ ఉన్న టైం లో బన్నీ సినిమా విడుదల అవుతోంది. ఓపెనింగ్ పరంగా స్కోర్ చేసినా.. 2 మిలియన్ డాల్లర్ల మార్క్ అందుకోవాలన్న బన్నీ కోరిక మాత్రం తీరడం అంత ఈజీ కాదు.