4 రోజుల్లో అల వైకుంఠపురములో రిలీజ్

Ala Vaikunthapurramlo to release on digital space on Feb 26
Saturday, February 22, 2020 - 11:00

అదేంటి అల వైకుంఠపురములో సినిమా ఆల్రెడీ రిలీజైపోయింది కదా. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కూడా అయింది కదా. మరి ఇప్పుడు కొత్తగా ఇంకో రిలీజ్ ఏంటి? అది కూడా 4 రోజల్లో ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ఇందులో ఆశ్చర్యపోవడానికేం లేదు. బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రాబోతోంది. అది కూడా మరో 4 రోజుల్లో.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుందని చాలామంది అనుకున్నారు. మరికొంతమంది నెట్ ఫ్లిక్స్ అని కూడా అనుకున్నారు. కానీ అల వైకుంఠపురములో సినిమా డిజిటల్ రైట్స్ ను కూడా సన్ నెట్ వర్క్ సంస్థే దక్కించుకుంది. ఈనెల 26న సన్ నెక్ట్స్ డిజిటల్ యాప్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాను చూసిన ఎంతోమంది డిజిటల్ వేదికపై కూడా చూసేందుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే, త్రివిక్రమ్ మాటలకు ఉన్న పవర్ అలాంటిది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్, కొన్ని సీన్స్ ఈ సినిమాను అలా నిలబెట్టాయి. అందుకే వాటి కోసం ఈ సినిమాను డిజిటల్ వేదికపై కూడా చూసేందుకు చాలామంది వెయిటింగ్. ఆ నిరీక్షణ మరో 4 రోజుల్లో తీరబోతోంది.