వైకుంఠపురం గుట్టువిప్పిన త్రివిక్రమ్

Ala Vaikunthapurramlo story revealed
Wednesday, December 11, 2019 - 22:00

అల వైకుంఠపురములో.. పేరులోనే ఓ చిన్నపాటి సస్పెన్స్. ఈ టైటిల్ ఏంటి? ఈ పేరు వెనక కథేంటి అనే క్యూరియాసిటీ అందర్లో ఉండేది. కొద్దిసేపటి కిందట విడుదలైన టీజర్ తో ఈ సస్పెన్స్ వీడిపోయింది. సినిమాలో హీరోయిన్ కుటుంబం ఉండే బంగళాకు వైకుంఠపురం అనే పేరు పెట్టాడు త్రివిక్రమ్. ఈ మేరకు టీజర్ లో ఓ చిన్న షాట్ కనిపించింది.

ఇదే కాదు, మరికొన్ని అనుమానాలకు కూడా టీజర్ తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. సినిమాలో బన్నీ కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉంటాడని, కావాలనే కొంతమందికి కొడుకుని కనిపించకుండా బన్నీ తండ్రి దాచేస్తాడనే విషయం కూడా టీజర్ తో తేలిపోయింది. అజ్ఞాతవాసి, అ..ఆ సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయని ఓవైపు కామెంట్స్ వచ్చినప్పటికీ.. వాటికి దూరంగానే సినిమా ఉంటుందనే విషయం టీజర్ తో తేలిపోయింది.

ఇక టీజర్ విషయానికొస్తే.. 7 నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది అల వైకుంఠపురం. ఇప్పటికే పాటలతో దుమ్ముదులిపిన ఈ సినిమా, ఇప్పుడు టీజర్ తో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించడం స్టార్ట్ చేసింది.