"అల" కలెక్షన్లు రియలా, పేక్ఖా!

Ala Vaikunthapurramloo 50 days collections
Monday, March 2, 2020 - 14:30

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మరోసారి వసూళ్లు బయటపెట్టారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 161 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 131 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు స్పష్టంచేశారు.

సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య భారీ పోటీ నడిచింది. విడుదలైన మొదటి రోజు నుంచి 2 వారాల వరకు ఈ రెండు సినిమాలు పోటీపడి వసూళ్ల పోస్టర్లు విడుదల చేశాయి. తాజాగా ఈ రెండు సినిమాలు 50 డేస్ పూర్తిచేసుకున్నాయి.

అల కంటే ఒక రోజు ముందే 50 రోజులు పూర్తిచేసుకుంది సరిలేరు నీకెవ్వరు సినిమా. కాకపోతే ఆ మూవీ వసూళ్లను మేకర్స్ రిలీజ్ చేయలేదు. నాన్-బాహుబలి రికార్డు సృష్టించిందని మాత్రమే ప్రకటించుకున్నారు. కానీ అల వైకుంఠపురములో మేకర్స్ మాత్రం మరోసారి ఫిగర్స్ (అనధికారికంగా) రిలీజ్ చేశారు. బాహుబలి-2 తర్వాత సినిమా తమదేనంటూ ప్రకటించుకున్నారు.

ఏపీ,నైజాం 50 రోజుల షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం - రూ. 44.87 కోట్లు
సీడెడ్ - రూ. 18.50 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 19.84 కోట్లు
ఈస్ట్ - రూ. 11.44 కోట్లు
వెస్ట్ - రూ. 8.93 కోట్లు
కృష్ణా - రూ. 10.84 కోట్లు
గుంటూరు - రూ. 11.14 కోట్లు
నెల్లూరు - రూ. 4.71 కోట్లు

మరి ఇవి నిజమేనా? ఇందులోనూ కొంత ఎక్కువ కలిపారా?