అల వైకుంఠపురంలో గుట్టు ఇదే

Ala Vaikunthapurramloo story is this
Friday, January 10, 2020 - 17:30

దర్శకుడు త్రివిక్రమ్ తన ప్రతి సినిమా ట్రైలర్ లో దాదాపుగా కథ ఇది అంటూ కొంత మేటర్ విప్పేస్తారు. బేసిక్ లైన్ ఏంటో వివరిస్తారు. అయితే, ఈసారి "అల వైకుంఠపురంలో" సినిమా విషయంలో ఆలా చేయలేదు. కథ విడిచి... వినోదంతో కూడిన ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేశారు. దాంతో ఈ మూవీ స్టోరీ గురించి రకరకాల కథలు వినిపిస్తున్నాయి. 

బ్రిటన్ లో సినిమాని సెన్సార్ చేసేటప్పుడు కథ ఏంటో చెప్పాలి. బ్రిటిష్ ఫిలిం సెన్సార్ సంస్థ ... ఆ స్టోరీ లైన్ ని తన వెబ్సైటు లో అప్డేట్ చేసింది. దాని ప్రకారం... కథ ఏంటంటే.. "ఒకతను తనకి పుట్టిన బిడ్డని మార్చేస్తాడు... తన కొడుకుని ధనవంతుల తల్లి ఒడిలో వదులుతాడు, వాళ్ళ బిడ్డని తన కొడుకుగా పెంచుతాడు." అంటే మూవీ స్టోరీ లోని అసలు గుట్టు ఇదే. 

"ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎన్ని చోట్ల తిరిగినా, ఎక్కడికెళ్లినా ఇంటికొస్తే ఆ సుఖం వేరు. అందుకే నా సినిమాల్లో ఇంటికి ఎక్కువ ప్రాధాన్యం. అల వైకుంఠపురములో సినిమాకు కూడా ఇంటి నేపథ్యం ఉంది. దానికి వైకుంఠపురం అనే పేరు పెట్టడం వెనక ఆంతర్యం వేరే ఉంది. హీరో వైకుంఠపురం అనే ఇంటికి ఎందుకు వెళ్లాడు, హీరో జీవితంలో అతడికి అదే అతిముఖ్యమైన విషయమైంది అనేది ఈ సినిమా. ఇంటికి వైకుంఠపురం అనే పేరు ఊరికే పెట్టలేదు. ఏకంగా సినిమా టైటిల్ కూడా అదే పెట్టామంటే ఇంపార్టెన్స్ అర్థంచేసుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత నా మాటలకు అర్థాలు తెలుస్తాయి," ఇలా త్రివిక్రమ్ తన సినిమా గురించి వివరణ ఇచ్చారు.