"అలా" బాహుబలి వైపు అంటున్న నిర్మాతలు

Alavaikunthapurramloo producers
Thursday, January 16, 2020 - 15:30

గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందంటూ థియేటర్లలోకొచ్చిన బన్నీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ హీరో చేసిన అల వైకుంఠపురములో సినిమా తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించింది అంటోంది బన్నీ మూవీ టీం. 

నిన్నటితో 4 రోజుల రన్ పూర్తిచేసుకున్న అల వైకుంఠపురములో సినిమా ఏపీ,నైజాంలో 7 ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించిందంట.  ఈ మేరకు హారిక-హాసిని క్రియేషన్స్ నుంచి కొత్త పోస్టర్ కూడా వచ్చేసింది. నైజాంతో పాటు.. ఏపీలోని సీడెడ్, వైజాగ్, కృష్ణ, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో నాన్-బాహుబలి-2 రికార్డులు సృష్టించినట్టు ప్రకటించారు.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే 2 మిలియన్ మార్క్ కు చేరువైన ఈ మూవీ, లాంగ్ రన్ లో 3 మిలియన్ మార్క్ టచ్ చేయడం గ్యారెంటీ అంటోంది ట్రేడ్. ఓవర్సీస్ లో అదనంగా 16 లొకేషన్లలో ఈ సినిమాకు స్క్రీన్ కౌంట్ పెంచడంతో 3 మిలియన్ చేరుకోవడం పెద్ద కష్టం కాదంటోంది. మొత్తమ్మీద ఒక రోజు లేటుగా వచ్చినా.. ఓవర్సీస్ లో మహేష్ మూవీని క్రాస్ చేసింది బన్నీ సినిమా.