తట్టుకోలేక ఏడ్చేసిన హీరోయిన్

Alia Bhatt breaks down on stage
Tuesday, December 3, 2019 - 06:45

ఆర్-ఆర్-ఆర్ లో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ కన్నీరుమున్నీరైంది. ఒక దశలో వేదికపై ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ముంబయిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

అలియాభట్ సోదరి షహీన్ తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడింది. ఎట్టకేలకు ఆమె దాన్నుంచి బయటపడింది. తన అనుభవాల్ని చెబుతూ, ఆమె ఓ పుస్తకం రాసింది. ఆ పుస్తకం పేరు ఐ హ్యావ్ నెవర్ బీన్ హ్యాపీయర్. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అలియాభట్ చీఫ్ గెస్ట్ గా రాగా.. న్యూస్ రిపోర్టర్/ప్రజెంటర్ బర్ఖా దత్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా తన సోదరి డిప్రెషన్ ను గుర్తుచేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురైంది అలియాభట్. ఒక దశలో తన కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసింది. తానెప్పుడూ డిప్రెషన్ లోకి వెళ్లలేదని, కానీ ఒకరకమైన బాధ, ఆత్రుత తనలో ఎప్పుడూ ఉండేవని చెప్పుకొచ్చిన అలియా.. తన సోదరి కోలుకోవడంతో ఇప్పుడు చాలా తేలిగ్గా ఉందని ప్రకటించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆర్-ఆర్-ఆర్, బ్రహ్మాస్త్ర, సడక్ 2 సినిమాలతో బిజీగా ఉంది. ఆర్-ఆర్-ఆర్ లో ఆమె రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో అలియాకు ఇదే తొలి సినిమా.