తెలుగు ట్యూటర్‌ని పెట్టుకున్న ఆలియా

Alia Bhatt learning Telugu
Wednesday, September 4, 2019 - 18:45

ఆలియా భట్‌ సిన్సియర్‌ నటి. పాత్ర కోసం చాలా కష్టపడుతుంది. ఇప్పటికే నటిగా రాజీ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకొంది. త్వరలోనే ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. రాజమౌళి తీస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో ఆమె రామ్‌చరణ్‌కి జోడి. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కానీ ఆమెకి సంబంధించిన సీన్లు తీస్తారు. ఈలోపు ఆమె తెలుగు నేర్చుకుంటోంది. ప్రత్యేకంగా ఒక ట్యూటర్‌ని పెట్టుకొని బేసిక్‌ తెలుగు నేర్చుకుంటోంది. డైలాగ్‌లు చెప్పేటప్పుడు తాను మాట్లాడుతున్నది ఏంటో ఇతర నటులు చెపుతున్నదేంటో తనకి అర్థం కావాలి అంటే బేసిక్‌ లాంగ్వేజ్‌ రావాలంంటోంది. అందుకే చిన్న పాత్రకే ఆమె అంత కష్టపడుతోంది.

అన్నట్లు.. ఆలియాభట్‌కి పెద్ద పాత్ర లేదు ఈ సినిమాలో రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లపైనే సినిమా ఎక్కువ ఫోకస్‌ పెడుతుంది. హీరోయిన్ల పాత్ర చాలా తక్కువ. ఆలియా భట్‌ పాత్ర లెంగ్త్‌ కూడా స్మాలే. ఐతే పాత్ర నిడివి ఎంత అనేది ముఖ్యం కాదు రాజమౌళి డైరక్షన్‌లో నటించడం ఇష్టం అని భారీ డైలాగ్‌ వదిలింది ఆలియా.

ఆలియాతో పాటు ఒక బ్రిటీష్‌ భామ ఈ సినిమాలో నటించనుంది. ఆలియా అల్లూరి సీతారామరాజుకి భార్యగా నటిస్తోంది. అల్లూరి పాత్రని చరణ్‌ పోషిస్తున్నాడు.