రాజమౌళి వెంట నేనే పడ్డా: ఆలియా

Alia Bhatt talks about RRR
Monday, April 22, 2019 - 17:45

రాజమౌళి ఏరికోరి ఆలియా భట్ ని తీసుకున్నాడని మనమంతా అనుకుంటున్నాం కదా. ఒక దశలో పారితోషికం విషయంలో ఆలియా బెట్టు చేస్తే రాజమౌళి ఆమెని ఎలాగోలా ఒప్పించాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆలియా భట్ మాత్రం అదంతా అబద్దపు ప్రచారం అంటోంది.

"ఆర్.ఆర్.ఆర్" సినిమాలో తనకి పాత్ర కావాలిని రాజమౌళి వెంట పడిందట. "ఈగ", "బాహుబలి" చిత్రాలతో ఆమె రాజమౌళికి ఫ్యాన్ అయింది. అప్పట్నుంచి ఆమెకి రాజమౌళి డైరక్షన్లో నటించాలనే కోరికనట. ఈ సారి ఎలాగైనా తనకి పాత్ర ఇవ్వాలని "బాహుబలి 2" విడుదలైన వెంటనే అడిగిందట ఆలియా. మీ నెక్స్ట్‌ సినిమాలో ఏదో ఒక రోల్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టానని అందుకే తనకి ఈ పాత్ర ఇచ్చారని చెపుతోంది ఆలియా.

"ఆర్.ఆర్.ఆర్"లోఆమె రామ్ చ‌ర‌ణ్‌ సరసన నటించనుంది. ఎన్టీఆర్ కి హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇంతకుముందు తీసుకున్న డైసీ అనే ఫారిన్ యువతి తప్పుకొంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు.