ఆలియాకి నచ్చిన టాలీవుడ్ హీరో ఇతనే

Alia praises Vijay Deverakonda
Wednesday, December 4, 2019 - 15:15

విజయ్ దేవరకొండ ... ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్ లోనూ మార్మోగుతోంది. మనోడి అందం, నటనకి అక్కడి హీరోయిన్లు కూడా ఫిదా అయిపోయారు. ఇప్పటికే జాన్వీ కపూర్... విజయ్ తో నటించాలని ఉందని చెప్పింది. కియారా అద్వానీ విజయ్ నటన అదుర్స్ అని చెప్పింది...ఒక యాడ్ లో కలిసి నటించింది. 

ఇప్పుడు ఏకంగా అగ్ర హీరోయిన్ ... అలియా భట్ విజయ్ పై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ టైమ్స్ లో ...ఏ యాక్టర్ బాగా నచ్చారు అని అడిగితే.. విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఆటను అమేజింగ్ యాక్టర్ అని కంప్లిమెంట్ ఇచ్చింది. ఇంకేం ఇంకేం కావలి విజయ్ కి... అలియా నుంచి ప్రశంసలు వచ్చాక.

విజయ్ నటనకి ఫిదా అయి బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ కూడా దోస్తీ పెంచుకున్నాడు. త్వరలోనే విజయ్ ...బాలీవుడ్ అరంగేంట్రం  ఉంటుంది. ప్రస్తుతం విజయ్... తెలుగులో 'వర్డ్ ఫేమస్ లవర్' సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జనవరి నుంచి పూరి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తాడు.