టాలీవుడ్ కాదు అలీవుడ్

Ali's Aliwood
Sunday, January 5, 2020 - 17:30

ఈ "వుడ్" కొత్తగా ఎక్కడ్నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఇది మీరు అనుకున్నది కాదు, సీనియర్ హాస్యనటుడు అలీ తన పేరిట పెట్టుకున్న కొత్త సంస్థ పేరు. అవును.. అలీవుడ్ పేరిట ఓ సంస్థ ఏర్పాటుచేశారు అలీ. అయితే ఈ బ్యానర్ పై ఆయన సినిమాలు నిర్మించరట.

అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెబ్ సిరీసులు, టెలీ సీరియల్స్ నిర్మిస్తానంటున్నారు అలీ. ప్రస్తుతానికి తన రేంజ్ అదేనని, తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తానని అంటున్నారు. అయితే ఇక్కడితో ఆగకుండా.. తన సంస్థపై 24 క్రాఫ్ట్స్ కు చెందిన సేవల్ని అందించబోతున్నట్టు ప్రకటించారు అలీ.

వైసీపీలో చేరిన తర్వాత మంత్రి పదవి ఆశించారు అలీ. కేవలం ఆ పదవి కోసమే జనసేనను వదిలి వైసీపీలో చేరిపోయారు. అయితే గెలిచిన తర్వాత అలీ ఆశించినది జరగలేదు. చివరికి నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. దీంతో ఓవైపు రాజకీయాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇలా సైడ్ బిజినెస్ వ్యవహారాలు ప్రారంభించారు అలీ.