సుడిగాడి సుడి తిర‌గాలంటే?

Allari Naresh teams up with Sudigadu director once again
Wednesday, October 25, 2017 - 15:15

అల్ల‌రి న‌రేష్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశాడు హిట్ కోసం. కానీ ఏదీ క‌లిసి రాలేదు. ఈ మ‌ధ్య ఆయ‌న‌కి వ‌చ్చిన‌న్ని ఫ్లాప్స్ మ‌రో హీరోకి రాలేదంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే న‌రేష్ మ‌ళ్లీ "సుడిగాడి" ద‌ర్శ‌కుడినే అప్రోచ్ అయ్యాడు.

అల్ల‌రి న‌రేష్ కెరియ‌ర్‌లో వెరీ బిగ్ హిట్‌.."సుడిగాడు". త‌మిళంలో హిట్ట‌యిన "త‌మిళ‌ప‌డం" అనే సినిమాకి రీమేక్‌గా వ‌చ్చింది "సుడిగాడు". ఆ సినిమాకి ద‌ర్శ‌కుడు భీమ‌నేని శ్రీనివాస‌రావు. భీమనేని రీసెంట్‌గా తీసిన "స్పీడున్నోడు" బాక్సాఫీస్ నుంచి  స్పీడ్‌గా వెన‌క్కి తిరిగి వ‌చ్చింది. ఐనా క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడితోనే క‌లిసి ప్ర‌యాణిస్తే బెట‌ర్ అని అల్ల‌రి న‌రేష్ ఆయ‌న డైర‌క్ష‌న్‌లోనే త‌న నెక్స్ట్ మూవీ సెట్ చేసుకున్నాడు.

ఐతే వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ మూవీ సుడిగాడికి సీక్వెల్ కాద‌ట‌. పూర్తిగా కొత్త త‌ర‌హాలో సాగే సినిమా (ట‌).