పో.ప్రో మొదలెట్టిన అల్లరి నరేష్

Allari Naresh's Nandi begins dubbing work
Monday, May 25, 2020 - 18:00

పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి టాలీవుడ్ లో. కరోనా లక్డౌన్ వల్ల దాదాపు 70 రోజుల పాటు తెలుగు చిత్రసీమ స్తంభించింది. ఎలాంటి పనులు జరగలేదు. ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ కి అనుమతిచ్చింది. షూటింగులు జూన్ లో చేసుకోవచ్చని తెలిపింది. దాంతో అల్లరి నరేష్ తన కొత్త మూవీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాడు.

అల్లరి నరేష్ హీరోగా స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న 'నాంది' డ‌బ్బింగ్ ప‌నులు రంజాన్ పర్వ‌దినం సంద‌ర్భంగా  మొద‌ల‌య్యాయి. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ఉప‌శీర్షిక‌. అల్ల‌రి న‌రేష్‌ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్ల‌రి న‌రేశ్ న‌టిస్తోన్న 57వ చిత్రం.