రవి బాబు అడల్ట్ అల్లరి

Allari Ravi Babu's adult youthful entertainer
Wednesday, January 1, 2020 - 23:15

అల్లరి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవిబాబు... తన చిలిపితనాన్ని మరోసారి బయటపెట్టాడు. వరుసగా ఫ్లాపులిస్తున్న ఈ డైరక్టర్ ఇప్పుడు మరోసారి తన బాణీలోకి మారాడు. క్రష్ అంటూ కొత్త సినిమా ప్రకటించాడు. న్యూ ఇయర్ సందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ చూస్తే, ఇదొక అడల్ట్ కామెడీ అనే విషయం అర్థమౌతూనే ఉంది.

నిజానికి రవిబాబుకు ఇష్టమైన జానర్, అతడికి హిట్స్ ఇచ్చిన జానర్ ఇది. అల్లరి సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన అమ్మాయిలు-అబ్బాయిలు కూడా రవిబాబుకు హిట్ ఇచ్చింది. అప్పట్నుంచి ఇతడు జానర్ మార్చాడు. హారర్ వెంటపడ్డాడు. స్టార్టింగ్ లో కొన్ని హిట్స్ ఇచ్చినా, రీసెంట్ గా అతడి ప్రయోగాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి మూలాల్లోకి వెళ్లిన రవిబాబు.. క్రష్ అంటూ తన ఒరిజినల్ చిలిపితనాన్ని బయటపెట్టాడు. ఎప్పట్లానే ఇందులో కూడా కొత్త హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని పరిచయం చేయబోతున్నాడు. తిరిగి తన పాత జానర్ లోకి ఎంటరైన రవిబాబు, కొత్త ఏడాదిలోనైనా హిట్ కొట్టాలని ఆశిద్దాం.