ఇది మీరు మాకు పెట్టిన బిక్ష

Allu Aravind is very happy
Sunday, January 12, 2020 - 23:00

అల వైకుంఠపురములో విజయాన్ని ప్రేక్షకులు తమకు పెట్టిన బిక్షగా అభివర్ణించారు అల్లు అరవింద్. చినబాబుతో కలిసి ఈ సినిమాను నిర్మించిన అల్లు అరవింద్.. సినిమా సక్సెస్ అయినందుకు చాలా ఆనందం వ్యక్తంచేశారు.

"ఇది మేం మీకు ఇచ్చిన గిఫ్ట్ కాదు. మీరు మాకు పెట్టిన బిక్ష. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో సినిమా కొనుక్కున్న బయ్యర్లు మొదటి రోజుకే లాభాల్లోకి వెళ్లిపోయారు. యీఎస్ లో తక్కువ థియేటర్లలోనే వేశారు. 14 డాలర్లే పెట్టారు. అయినా 8 లక్షల డాలర్లు దాటింది."

సక్సెస్ పై మొదటి రోజే పూర్తిగా మాట్లాడడం సరికాదన్నారు అల్లు అరవింద్. ఇంకా చాలా ఫంక్షన్లు నిర్వహిస్తామని, ఆరోజున మాట్లాడతానన్నారు. బన్నీకి కెరీర్ లో ఈ సినిమా ఆల్ టైమ్ హిట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన అరవింద్.. తమ కుటుంబానికి అసలైన పండగ వచ్చిందన్నారు.