ఒత్తిడి తట్టుకోలేక ఆస్తులు పంచిన అరవీంద్

Allu Aravind writes will
Tuesday, October 15, 2019 - 09:00

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఆస్తులన్ని పంచి పెట్టారు. తన ముగ్గురు కొడుకులకు సమానంగా ఇచ్చేసారు. ఒత్తిడి తట్టుకోలేక ఇలా చేశారనేది టాక్. ఏ కొడుక్కి ఏ ఆస్తి అని క్లియర్ గా చెప్పిన తర్వాతే.. అల్లు అర్జున్ సొంతంగా ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాడు. ఇటీవలే బన్నీ హైదరాబాద్ లో పెద్ద భవంతి నిర్మాణానికి  భూమి పూజ చేశాడు.   

అల్లు అరవింద్ కి అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్.. ముగ్గురు కొడుకులు. అల్లు అర్జున్ ...పెద్ద స్టార్ గా నిలబడ్డారు. శిరీష్ కిందా మీద పడుతున్నాడు హీరోగా నిలబడాలని. ఇప్పుడు బాబీ నిర్మాతగా రంగంలోకి దిగాడు. ఫ్యూచర్ లో ఎటువంటి సమస్య ఉండకుండా... తన పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని... అరవింద్ ముందే ఈ నిర్ణయం తీసుకున్నారట. వయసు పెరగడంతో ఇక ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేక, ఒత్తిడి తగ్గించుకునేలా ఇలా వీలునామా రాసారు.