బన్నీ ఇక స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు

Allu Arjun gets enough money to build swimming pool
Tuesday, January 21, 2020 - 12:45

"అల వైకుంఠపురం" సినిమా రిలీజైన వెంటనే అల్లు అర్జున్ ఓ మాట అన్నాడు. "ఈ సినిమాతో మా నాన్నకి బాగా డబ్బులు రావాలి... ఆయనకి ఎంత డబ్బులు వస్తే నాకు అంత మంచిది. ఎందుకంటే... నేను ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా. స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలి దానికి డబ్బులు కావాలి. పెద్ద హిట్ అయితే ... మా నాన్న దగ్గరినుంచి తీసుకుంటా," అని జోక్ గా అన్నాడు.

అది జోక్ అయినా... ఆయన మాట నిజం అయింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు.. టాలీవుడు చరిత్రలోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలుస్తోంది ఈ మూవీ. అంటే.. అల్లు అరవింద్ కి సహా నిర్మాతగా బాగా లాభాలు వస్తాయి. సో బన్నీ ... స్విమ్మింగ్ పూలే కాదు.. ఇంకా చాలా కట్టుకోవచ్చు. 

అన్నట్లు ఈ సినిమాకి బన్నీ రిలీజ్ కు ముందే భారీ మొత్తం పారితోషికం తీసుకున్నాడు. దాదాపు 30 కోట్ల ఉంటుంది అతని రెమ్యూనరేషన్. ఇక ఇది ఇంత హిట్ అయింది కాబట్టి ఇప్పుడు మరింత పెంచుతాడేమో.

ఇవి చదివారా?
సుకుమార్ సినిమాకి టైటిల్ అది కాదు!
ఆ సీక్రెట్ బయటపెట్టిన అల్లు అర్జున్