అమెరికాలో మహేష్ పై బన్నీదే పైచేయి

Allu Arjun gets upper hand over Mahesh Babu
Sunday, January 12, 2020 - 14:30

ఇది ఎవరూ ఊహించలేదు. అమెరికా మార్కెట్ లో కింగ్ అనిపించుకునే మహేష్ బాబు సినిమాని మించి అల్లు అర్జున్ నటించిన మూవీ ఎక్కువ ఓపెనింగ్ తెచ్చుకుంటుంది అని ఎవరూ అంచనా వేయలేదు. "అల వైకుంఠపురంలో" సినిమా కేవలం 14 డాలర్ల టికెట్ ధరతో ఈ మూవీ ప్రీమియర్ షోలతో ఏకంగా 8 లక్షలకి పైగా డాలర్లని సంపాదించింది. ఒక రోజు ముందు విడుదలయిన మహేష్ బాబు సినిమా 20 డాలర్ల టికెట్ ధరతో ప్రీమియర్ షోలతో 7 లక్షల 60 వేలని పొందింది. అంటే "అల వైకుంఠపురంలో  ఎక్కువ వసూళ్ళని పొందడమే కాదు ఎక్కువ మంది ప్రేక్షకులని థియేటర్లకు రప్పించింది. 

ఈ సినిమాకి తక్కువ ధర ఒక అడ్వాంటేజ్ అయింది. అంతే కాదు సినిమాపై మొదటి నుంచి ఉన్న పాజిటివ్ ఫీలింగ్... దానికి తోడు త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్ 
బాగా హెల్ప్ అయ్యాయి. 

ఈ సినిమాకి ముందు బన్నీ కెరీర్లో ఏ సినిమా కూడా 4 లక్షలని మించి ప్రీమియర్ షో వసూళ్లు పొందలేదు. ఇది ఏకంగా డబులు అమౌంట్ పొందింది. ఇక ఇప్పుడు అన్ని పాజిటివ్ రేటింగ్ లే వచ్చాయి. సో దీని  రన్ ని ఎవరూ ఆపలేరు.