బన్నీకి ఇష్టమైన సినిమాలివే

Allu Arjun lists out his favorite three movies
Monday, May 25, 2020 - 20:15

ప్రతి ప్రేక్షకుడికి తమ జీవితంలో ఇష్టమైన సినిమాలుంటాయి. కనీసం 3 సినిమాలైనా ఫేవరెట్స్ గా పెట్టుకుంటాడు. మరి హీరోలకు ఇష్టమైన సినిమాలేంటి? ఇది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. దీనిపై బన్నీ స్పందించాడు. తనకు ఆ 3 సినిమాలంటే చాలా ప్రాణం అంటున్నాడు అల్లు అర్జున్. ఆ 3 సినిమాలేంటో చూద్దాం.... 

అమీర్ ఖాన్ నటించిన "జో జీతా వహీ సికిందర్" అనే సినిమా అల్లు అర్జున్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఈ సినిమాను ఇప్పటివరకు ఓ 20 సార్లు కంటే ఎక్కువే చూశాడట. ఇక బన్నీకి ఇష్టమైన మరో సినిమా షారూక్ నటించిన "దిల్ వాహే దుల్హనియా లే జాయేంగే". బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూక్ నటించిన ఈ డీడీఎల్జే సినిమాను కూడా చాలాసార్లు చూశానని చెప్పుకొచ్చాడు.

ఈ రెండు సినిమాల తర్వాత బన్నీ ఎక్కువసార్లు చూసిన మూవీ "గల్లీబాయ్". రణ్వీర్ సింగ్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఇప్పటికే 3-4 సార్లు చూశాడట బన్నీ. తనకు పర్సనల్ గా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అంటున్నాడు. ఇలా తనకు అత్యంత ఇష్టమైన సినిమాల లిస్ట్ ను బయటపెట్టాడు బన్నీ.

అల్లు అర్జున్ ఆ మూడు సినిమాలు అంటే పిచ్చ పిచ్చి అభిమానమంట. ఆ మూడు సినిమాలు కూడా హిందీ మూవీస్. తనకి ఇష్టమైన చిత్రాల లిస్ట్ బయట పెట్టాడు బన్నీ.