సైనికుల‌తో బ‌న్ని వాలీబాల్‌

Allu Arjun plays volleyball with Indian soldiers
Tuesday, February 20, 2018 - 15:15

"నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా న‌టిస్తున్నాడ‌నేది అందరికీ తెలిసిన న్యూసే. సినిమా క‌థ ప్ర‌కారం దేశ స‌రిహ‌ద్దు ప్రాంతంలోని ఆర్మీ బేస్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు తీశారు. ఆ సంద‌ర్భంగా అల్లు అర్జున మ‌న వీర జ‌వాన్‌ల‌తో స‌ర‌దాగా సెల్ఫీలు దిగాడు. వారితో ఆనందంగా ముచ్చ‌టించాడు. అంతే కాదు, వాలీబాల్ కూడా ఆడాడు.

బ‌న్ని సైనికుల‌తో క‌లిసి వాలీబాల్ ఆడుతున్న‌ వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కి చేరుకొంది. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 26న విడుద‌ల కానుంది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక పాత్ర పోషిస్తుండ‌గా. బొమన్‌ ఇరానీ, శరత్‌ కుమార్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్ ఇత‌ర‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ -శేఖర్ సంగీతం అందిస్తున్నారు.