ఇన్‌స్టాగ్రామ్‌లోనూ బ‌న్ని అదుర్స్‌

Allu Arjun posts daughter Arha pic on Instagram as first post
Tuesday, November 21, 2017 - 13:45

అల్లు అర్జున్‌కి సోష‌ల్ మీడియాలోనూ సూప‌ర్ ఫాలోయింగ్ ఉంది. అటు ఫేస్‌బుక్‌లోనూ, ఇటు ట్విట్ట‌ర్‌లోనూ మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇపుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వ‌చ్చాడు. కూతురు మొద‌టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ రోజు ఆయ‌న కూతురు తొలి పుట్టిన రోజు.

తొలి ఫోటోగా కూతురి ఫోటోని షేర్ చేశాడు. అర్హా తొలి పుట్టిన రోజు సందర్భంగా ఆయ‌న పోస్ట్ చేసిన ఈ పిక్ బాగా వైర‌ల్ అయింది. మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  బన్నీ ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేల‌ల్లో లైక్స్ వ‌చ్చాయి. ఫాలోవ‌ర్స్ సంఖ్య కూడా ల‌క్ష దాటింది.