వేణు శ్రీరామ్ కి హ్యాండ్ ఇచ్చినట్టే?

Allu Arjun puts Sriram Venu’s film on hold?
Monday, September 16, 2019 - 12:00

ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టాలని భారీ స్కెచ్‌ వేశాడు అల్లు అర్జున్‌. ఒకే ఏడాది టైమ్‌ అంతా ఖాళీగా ఉండడంతో ..కోల్పోయిన ఆ టైమ్‌ని కవర్‌ చేసేందుకు వరుసగా మూడు సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరాడు. కానీ అది ఇపుడు వర్కవుట్‌ అవట్లేదు. త్రివిక్రమ్‌ సినిమాతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌, సుకుమార్‌ డైరక్షన్‌లో మరోటి.. ఇలా అన్ని ఒకేసారి అనౌన్స్‌ చేశాడు. అభిమానులు ఈ ప్రకటనతో పండగ చేసుకున్నారు. కానీ ఇపుడు... ఆయన భారీ ప్లాన్‌కి బ్రేకులు పడ్డాయి.

తన సినిమా మొదలుపెట్టకుండా.. మరోటి ఓకే చేసేందుకు సుకుమార్‌ ససేమిరా అన్నాడు. సుకుమార్‌ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలల్లో లాంచ్‌ చేయాలి. దానికి తోడు త్రివిక్రమ్‌ సినిమా పూర్తి చేయాలి. సో... ప్రియారిటీ ప్రకారం.. త్రివిక్రమ్‌ తీస్తున్న అల వైకుంఠాపురంలో ..డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి, జనవరి నుంచి సుకుమార్‌ సినిమాని ఫుల్‌ రేంజ్‌లో మొదలుపెట్టాలి. సమ్మర్‌ తర్వాత కావాలంటే మరో సినిమాని మొదలుపెట్టుకోవచ్చు.

ఈ లెక్కన ఐకాన్‌ సినిమా ఇపుడు షూటింగ్‌ కుదరదు. ఈ విషయాన్ని దిల్‌రాజుకి, వేణు శ్రీరామ్‌కి ఆల్రెడీ చెప్పేశాడు. పైగా వేణు శ్రీరామ్‌ సినిమాకి భారీ బడ్జెట్‌ కావాలట. అంత బడ్జెట్‌తో హడావుడిగా సినిమా చేస్తే అసలుకే మోసం వస్తుంది. సో.. ఆ సినిమాని తర్వాత టేకప్‌ చేద్దామని బన్ని పక్కన పెట్టాడు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.