ఆ సీక్రెట్ బయటపెట్టిన అల్లు అర్జున్

Allu Arjun reveals a secret about Ala Vaikunthapurramloo
Monday, January 13, 2020 - 16:00

అల వైకుంఠపురములో సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి బంటు పాత్రలో నటించాడు అల్లు అర్జున్. ఆ క్యారెక్టర్ కోసం త్రివిక్రమ్ తో కలిసి బాగానే రీసెర్చ్ చేశాడు. అయితే మరీ మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్స్ లో చూపిస్తే, ఆర్ట్ ఫిలిం అనే ఫీలింగ్ వస్తుందని భావించారు. అందుకే మధ్యతరగతి కుర్రాడే అయినప్పటికీ బన్నీకి ఓ సెపరేట్ స్టయిల్ పెట్టారు.

అంతా ప్యాంట్ పాకెట్ లో కర్చీఫ్ పెట్టుకుంటారు. కానీ సినిమాలో బంటు పాత్రధారి బన్నీ మాత్రం షర్ట్ ప్యాకెట్ లో కర్చీఫ్ పెట్టుకున్నాడు. స్టిల్స్ లో కూడా బన్నీ జేబులో ఏదో ఉన్నట్టు చాలామంది గమనించారు. మిడిల్ క్లాస్ లో ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తికి ఓ ఐడెంటిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఎట్టకేలకు దీనిపై బన్నీ క్లారిటీ ఇచ్చాడు.

"సినిమాలో నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. అలాంటి అబ్బాయి కాస్ట్ లీ బట్టలు వేయడు. చాలా తక్కువ ఖరీదైన దుస్తులే వేసుకుంటాడు. అయితే ఎంత మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా ప్రతి ఒక్కడిలో ఓ స్టయిల్ ఉంటుంది. ఓ కొత్తదనం కనిపిస్తుంది. దాన్ని మేం కూడా సినిమాల్లో చూపించాలనుకున్నాం. అందుకే హీరో షర్ట్ ప్యాకెట్ లో కర్చీఫ్ పెట్టాం. అది స్టయిల్  కోసం చేసింది కాదు, మిడిల్ క్లాస్ లో కూడా ఓ కొత్తదనం చూపించడం కోసం చేసిన ప్రయత్నం."

ఇది పూర్తిగా బన్నీ కాన్సెప్ట్ అంట. అతడి ఆలోచన నుంచే ఇది పుట్టుకొచ్చింది. ప్రేక్షకులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరని తను భావించానని, కానీ ఆడియన్స్ ఆ చిన్న ఎలిమెంట్ ను కూడా గమనించడం చాలా హ్యాపీగా ఉందంటున్నాడు బన్నీ.