కరోనా: సూపర్ మార్కెట్ లో బన్ని!

Allu Arjun spotted buying groceries
Friday, March 27, 2020 - 22:30

కరోనా దెబ్బతో సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బయట అడుగు పెట్టలేక, ఇంట్లో నిత్యావసరాలు లేక తెగ సతమతమౌతున్నారు. స్వయంగా అల్లు అర్జున్ బయటకొచ్చి పచారీ సామాన్లు కొన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అవును.. కరోనా దెబ్బతో పనిమనుషులు, వ్యక్తిగత సిబ్బంది కూడా ఇళ్లకే పరిమితం అవ్వడంతో.. బన్నీ బయటకు రాక తప్పలేదు. తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ షాపింగ్ మాల్ లోకి వెళ్లాడు బన్నీ. ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కొనుకున్నాడు. ఓ చిన్న షార్ట్, టీషర్ట్ వేసుకొని ముఖానికి మాస్క్ తగిలించుకున్న బన్నీని చాలామంది గుర్తుపట్టలేదు. అయితే కొంతమంది మాత్రం గుర్తుపట్టారు. దూరం నుంచే తమ కెమెరాలకు పని చెప్పారు. అలా బన్నీ ఫొటోలు బయటకొచ్చి వైరల్ అయ్యాయి.

అన్నట్టు కరోనాను కట్టడి చేసేందుకు చాలామంది హీరోల్లా బన్నీ కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు డొనేషన్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా విరాళం ఇచ్చాడు. అల్లు అర్జున్ కు మలయాళంలో కూడా ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే.