దిల్ రాజు దూకుడుకి కళ్లెం

Allu Arjun stops Dil Raju's speed
Friday, August 2, 2019 - 22:15

అల్లు అర్జున్ ని తొందర పెట్టి వెంటనే సినిమాని షురూ చేద్దామని అగ్ర నిర్మాత దిల్ రాజు స్కెచ్చేశారు. కానీ సుకుమార్ ఈ విషయంలో ముందే మేల్కొన్నాడు. బన్నిని ఒప్పించి వచ్చే నెల నుంచే తన సినిమాని మొదలుపెడుతున్నాడు సుకుమార్.

సుకుమార్ ఇంకా కథ రెడీ చేసుకోలేదన్న ప్రచారం నేపథ్యంలో దిల్ రాజు సీన్లోకి ఎంటరయ్యారు. "ఐకాన్" అనే సినిమాకి ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి వెంటనే మా సినిమా మొదలు పెట్టు అని దిల్ రాజు బన్ని ముందు ప్రపోజల్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సుకుమార్... హడావుడిగా లండన్ వెళ్లారు. అక్కడ నెల రోజుల పాటు రెస్ట్ తీసుకొని... అక్కడే స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి వచ్చారు. రాగానే బన్నికి కథ మొత్తం నేరేట్ చేసి లాక్ చేయించారు. అంటే సెప్టెంబరులోనే సుకుమార్ - బన్ని సినిమా షురూ అవుతుంది.

ఆ విధంగా దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదలు కావాల్సిన వేణు శ్రీరామ్ "ఐకాన్" వెనక్కి వెళ్లింది. అది వచ్చే ఏడాది ప్రారంభంలో షురూ అవుతుంది. అల్లు అర్జున్ ఇలా ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకొని చాలా కనుప్యూజన్లో పడేశాడు. ఒకవైపు త్రివిక్రమ్ సినిమా సగభాగం పూర్తి కాకముందే ఆ తర్వాత వచ్చే రెండు సినిమాల దర్శకులు ఇలా పోటీపడడం సరైన ట్రెండు కాదు. ఐతే ..."నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" పరాజయం తర్వాత బన్ని ఏడాది 
పాటు ఖాళీగా ఉన్నాడు. అలా నష్టపోయిన టైమని ఇపుడు సేవ్ చేసుకునే ప్రయత్నంలో మూడు సినిమాలు ఒకేసారి సైన్ చేశాడు.