అంతా అలా జరిగిపోయింది- బన్నీ

Allu Arjun's explanation about his lengthy speech
Friday, January 10, 2020 - 17:15

ఫస్ట్ టైమ్ స్టేజ్ పై డాన్స్ చేశాడు బన్నీ. అల వైకుంఠపురములో మ్యూజికల్ ఫెస్ట్ లో ఫినిషింగ్ టచ్ గా రాములో రాముల సాంగ్ కు చిన్న స్టెప్ వేసి తన ఆర్మీని (ఫ్యాన్స్) ఉత్సాహపరిచాడు. దీనిపై తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యాడు అల్లు అర్జున్. తను డాన్స్ చేయాలని అనుకోలేదన్నాడు.

స్టేజ్ పై డాన్స్ చేయాలని బన్నీ అనుకోలేదట. ఆ టైమ్ కు ఊపు వచ్చేసింది. డాన్స్ చేయాలని అనిపించింది. అంతే, వెంటనే మ్యూజిక్ పెట్టమన్నాడు, పాటకు డాన్స్ చేసేశాడు. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు అల్లు అర్జున్. స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు తనకు చాలా వచ్చాయని, కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్లు కూడా ఇచ్చారని, కానీ తను వాటిని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. తనకు నచ్చితేనే స్టేజ్ పై డాన్స్ చేస్తానని స్పష్టంచేశాడు.

మరోవైపు సుదీర్ఘంగా ఇచ్చిన స్పీచ్ పై కూడా రియాక్ట్ అయ్యాడు బన్నీ. అంతసేపు మాట్లాడతానని అనుకోలేదని, ఎందుకో స్టేజ్ ఎక్కిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయానని, మైండ్ లోకి చాలా అంశాలు అలా అలా వచ్చేశాయని అందుకే అలా మాట్లాడుకుంటూ వెళ్లిపోయానని అన్నాడు. ఎక్కువ సేపు మాట్లాడతానని ఫ్యాన్స్ కు స్పీచ్ ప్రారంభంలోనే చెప్పినప్పటికీ, అదిలా 30 నిమిషాలకు పైగా సాగుతుందని అనుకోలేదంటున్నాడు. ఫంక్షన్ లో అన్నీ అలా జరిగిపోయానని అన్నాడు.