బన్నీ నోట 'పాన్'పరాగ్!

Allu Arjun's Pan India plans
Tuesday, August 4, 2020 - 15:45

"అల వైకుంఠపురములో" సక్సెస్ తో అల్లు అర్జున్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. తెలుగు కాకుండా మొన్నటివరకు మలయాళం ఇండస్ట్రీపై బన్నీకి పట్టు ఉండేది. ఇప్పుడు "అల.." ఇచ్చిన ఊపుతో మిగతా భాషలపై కూడా దృష్టిపెట్టాడు స్టయిలిస్ స్టార్.

ప్రస్తుతం బన్నీ చేతిలో ఉన్న సినిమా "పుష్ప". సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లుఅర్జున్. ఈ మూవీని కూడా వివిధ భాషల్లో తెరకెక్కించబోతున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

కేవలం ఈ రెండు సినిమాలే కాదు.. ఇకపై తన నుంచి వచ్చే ప్రతి సినిమాను ఇలా పాన్ ఇండియా అప్పీల్ తో రిలీజ్ చేయాలని బన్నీ నిర్ణయించాడు. అందుకు తగ్గట్టే దర్శకుల్ని, కథల్ని సెలక్ట్ చేసుకుంటున్నాడు ఈ హీరో.

సో.. ఇకపై బన్నీ సినిమాలు కేవలం తెలుగు-మలయాళం భాషల్లోనే కాకుండా.. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతాయన్నమాట.