బ‌న్ని కొడుకు హంగామా

Allu Arjun's son Ayaan makes an impression
Monday, June 12, 2017 - 18:30

రాక రాక ఆడియో ఫంక్షన్ కు వచ్చాడు. సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతడే బన్నీ కొడుకు అయాన్. తన చిన్ని చిన్ని ఎక్స్ ప్రెషన్స్ తో, బుజ్జి మేనరిజమ్స్ తో డీజే ఆడియో ఫంక్షన్ కే హైలెట్ గా నిలిచాడు అయాన్. ఆడియో సీడీని కూడా అయాన్ చేల మీదుగానే లాంచ్ చేశారు. ఇపుడు ఈ బుల్లిబాబు సోష‌ల్ మీడియాలో టాపిక్‌గా మారాడు.

అయాన్ ఫొటోలతో కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు పొగడ్తలతో ముంచెత్తారు. ఓ వైపు చిన్నగా వర్షం పడుతుంటే కలర్ ఫుల్ గొడుగు వేసుకొని శిల్పకళావేదికలోకి ఎంటరయ్యాడు జూనియర్ బన్నీ. ఇక ఫినిషింగ్ టచ్ గా వేదికపై రెండు చేతులు పైకెత్తి అయాన్ మొక్కే స్టిల్స్ కూడా వచ్చాయి. వీటిపై కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అయితే, మరికొందరు ఫ‌న్నీ కామెంట్స్ తో రెస్పాండ్ అయ్యారు. ఇల తొలి పబ్లిక్ ఫంక్షన్ తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయాడు అయాన్.