చిట్టి "అల్లు"డు!

Allu Ayaan poses as Ram Charan
Thursday, March 22, 2018 - 15:15

అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్‌కి పాట‌లన్నా, డ్యాన్స్ అన్నా తండ్రిలాగే తెగ‌ ఇష్ట‌మంట‌. మొన్న ప్రియా ప్రకాష్ వారియ‌ర్ గ‌న్ పేల్చినట్లు అయాన్ కూడా పేల్చాడు. ఆ వీడియోని అయాన్ త‌ల్లి స్నేహ మురిపెంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇపుడు ఈ చిట్టి అల్లు ...చిట్టిబాబుని అనుక‌రిస్తున్నాడు.

రంగ‌స్థ‌లం సినిమాలో చిట్టిబాబుగా రామ్‌చ‌ర‌ణ్ క‌ట్టుకున్న లుంగీ, బనియ‌న్ ప‌ద్ద‌తిలోనే అల్లు అయాన్ ధ‌రించి.. డ్యాన్స్ చేయ‌డం మొద‌లుపెట్టాడు ఇంట్లో. దాన్ని త‌న కెమెరాలో బంధించి షేర్ చేశాడు అల్లు అర్జున్.

అచ్చంగా చ‌ర‌ణ్ ఫోజునే అయాన్ దించేశాడు. ఈ ఫోటో ఇపుడు వైరల్ అవుతోంది.