లాక్డౌన్ లో పార్టీ చేసుకున్న హీరోయిన్

Amala Paul celebrates during lockdown
Wednesday, May 6, 2020 - 17:00

అసలే లాక్ డౌన్ టైమ్. పబ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అయితేనేం అమలాపాల్ పార్టీ చేసుకోవడానికి ఇవేం అడ్డం కాలేదు. ఓవైపు పాప్ మ్యూజిక్, మరోవైపు జిగేల్ మనిపించే లైటింగ్స్, ఇంకోవైపు అమలాపాల్ డాన్స్.. ఇలా ఫుల్ గా పార్టీ చేసుకుంది అమలాపాల్. అయితే ఈ సెటప్ అంతా ఆమె ఇంట్లోనే.

అవును.. క్వారంటైన్ టైమ్ లో తన ఇంటినే పార్టీకి వేదికగా మార్చేసింది అమలాపాల్. తన తమ్ముడు అభిజిత్ పాల్ పుట్టినరోజు కోసం అమలాపాల్ చేసిన ఏర్పాటు ఇది. ఈ సందర్భంగా కరోనా సందేశం కూడా ఇచ్చింది అమలాపాల్.

ఇది అందరూ కలిసి చేసుకున్న పార్టీ కాదు. దూరం పాటిస్తూ ముసుగు ధరించి చేసుకున్న పార్టీ అంటూ ప్రకటించింది. అంతేకాదు.. మాస్క్ వేసుకొని మరీ డాన్స్ చేసింది. ఆమె పార్టీ, ముఖానికి మాస్క్ సంగతి పక్కనపెడితే.. అమలాపాల్ వేసుకున్న ఆ చిట్టిపొట్టి డ్రస్ మాత్రం నెటిజన్లను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది.