ధనుష్ తప్పు లేదు: అమల

Amala Paul opens up about Dhanush
Tuesday, February 18, 2020 - 16:45

ధనుష్ నిర్వాకం వల్లే అమల పాల్ భర్త విజయ్ నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అని ఇటీవల ఆమె మాజీ మామయ్య ఆరోపణలు చెయ్యడం కలకలం సృష్టించింది. ఈ కామెంట్స్ పై ఇప్పటి వరకు ధనుష్ నోరు విప్పలేదు. కౌంటర్ కామెంట్ చెయ్యలేదు. ఇప్పుడు అమల పాల్ మౌనం వీడింది. 

"నా భర్త నుంచి విడిపోవాలనుకోవడానికి ధనుష్ కి ఎలాంటి సంబంధం లేదు. ధనుష్ మంచి స్నేహితుడు. అతని ఇన్వాల్వ్ మెంట్ ఏమి లేదు ఇందులో. ఐనా గతాన్ని తవ్వుకోవడం ఇష్టం లేదు. మీడియా కూడా ఇతరుల కామెంట్స్ కి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడే వదలండి," అంటూ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పింది. 

ధనుష్, అమల పాల్ 'రఘువరన్ బీటెక్' వంటి సినిమాల్లో కలిసి నటించారు. ధనుష్ ఆమెని రెచ్చగొట్టి మళ్ళీ యాక్టింగ్ చేసేలా బిహేవ్ చేశాడనేది అమల పాల్ మాజీ మావయ్య కామెంట్. కానీ అయన మాటల్లోని అసలు ఆంతర్యం వేరే ఉందని ఊహాగానాలు రావడంతో అమల స్పందించింది.