జీ గ్రూప్ తో అమెజాన్ చర్చలు

Amazon Prime holding talks with Zee group
Tuesday, April 7, 2020 - 12:00

లాక్ డౌన్ లో జనాలంతా డిజిటల్ స్ట్రీమింగ్ వైపు మళ్లుతున్న వేళ.. అమెజాన్ ప్రైమ్ తన దగ్గరున్న దారులన్నీ ఓపెన్ చేసింది. ఇప్పటికే కొత్త సినిమాల్ని స్ట్రీమింగ్ కు పెట్టింది ఈ సంస్థ. రీసెంట్ గా రిలీజైన ఓ పిట్టకథ, హిట్, పలాస అనే సినిమాల నుంచి థియేటర్లు మూసేయడానికి కొన్ని రోజుల ముందు ఆఖరి చిత్రంగా వచ్చిన మథ అనే మూవీని కూడా రేపోమాపో అది స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది.

ఇది చాలదన్నట్టు ఇప్పుడు మిగతా ఛానెల్స్ వద్ద ఉన్న సినిమాలపై కూడా అమెజాన్ కన్నేసింది. షార్ట్ టెర్మ్ అగ్రిమెంట్ కింద కొన్ని సూపర్ హిట్ సినిమాల్ని తీసుకొని ప్రైమ్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జీ గ్రూప్ తో చర్చలు ప్రారంభించింది అమెజాన్.

జాతీయ స్థాయిలో చూసుకుంటే జీ గ్రూప్ వద్ద భారీ సినిమాలున్నాయి. అన్ని భాషలతో కలుపుకొని ఆ గ్రూప్ వద్ద పెద్ద లైబ్రరీనే ఉంది. వాటిలోంచి కొన్ని సూపర్ హిట్ టైటిల్స్ ను తీసుకొని తాత్కాలిక ఒప్పందం మీద ప్రైమ్ వీడియోస్ లో పెట్టాలనేది ఆ సంస్థ ఆలోచన. అటు ఆర్థిక కష్టాల్లో ఉన్న జీ గ్రూప్ కూడా ఈ ఒప్పందానికి అంగీకరించేలా ఉంది.

కాకపోతే ఆల్రెడీ ఆ సంస్థకు ZEE5 అనే యాప్ ఉంది. ఇప్పుడిప్పుడే దానికి ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి టైమ్ లో తమ వద్ద ఉన్న మూవీ లైబ్రరీని అమెజాన్ తో షేర్ చేసుకుంటే ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయా అనే ఆలోచనలో ఉంది.