అమీషాకి ట్రాల‌ర్ల సెగ

Ameesha Patel trolled for photoshoot video
Tuesday, February 20, 2018 - 15:30

41 ఏళ్ల అమీషాకి ట్రాల‌ర్ల సెగ త‌గిలింది. ఏ సెల‌బ్రిటీ అయినా త‌ప్పు చేస్తే..సోష‌ల్ మీడియాలో సాధార‌ణ జ‌నం ఎత్తిచూపిన‌ట్లు మాట్లాడ‌డ‌మే ట్రాలింగ్‌. అలా చేసే వారిని ట్రాల‌ర్స్ అంటారు. అమీషా ప‌టేల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోసూట్ వీడియో పోస్ట్ చేసింది. బెడ్‌లో ప‌డుకొని ఉండ‌గా కెమెరామెన్ ఆమె అందాల‌ను బంధించే ఒక వీడియోని విడుద‌ల చేసింది. అంతే ఆమెకి నాస్టీ కామెంట్స్ వ‌చ్చి ప‌డ్డాయి.

అమీషా తెలుగులో ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న"బ‌ద్రి", మ‌హేష్‌బాబు స‌ర‌స‌న "నాని", ఎన్టీఆర్‌తో "న‌ర‌సింహుడు" చిత్రాల్లో న‌టించింది. రీసెంట్‌గా ఆక‌తాయి అనే సినిమాలో ఆమె ఐటెంసాంగ్ చేసింది.

 

Throwback video of a recent photoshoot ❤️❤️

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on Feb 19, 2018 at 7:06am PST