అమితాబ్ ఇక నటించలేడా?

Amitabh Bachchan to take long leave
Monday, June 1, 2020 - 16:15

ఆయన కెరీర్ కు భారీ బ్రేక్ పడబోతోందా?

ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ కోణంలోనే పెద్ద చర్చ నడుస్తోంది. దీనికి కారణం కరోనా. ముంబయిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. దేశం మొత్మమ్మీద అత్యథిక కేసులు అక్కడే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల పాటు బాలీవుడ్ లో షూటింగ్స్ ఉండవు. అయితే షూటింగ్స్ కు అనుమతి లభించిన తర్వాత కూడా బిగ్ బి నటించేది కష్టమే అంటున్నారు చాలామంది.

పదేళ్ల లోపు చిన్నారులు.. 65 ఏళ్లు దాటిన పెద్దోళ్లపై కరోనా పెను ప్రభావం చూపిస్తుంది. కాబట్టి 77 ఏళ్ల అమితాబ్ సెట్స్ పైకి రాకుండా ఉండడమే మంచిదంటున్నారు చాలామంది. ఆల్రెడీ 3 నెలలు గ్యాప్ వచ్చేసింది. కనీసం మరో 7-8 నెలలు బిగ్ బి సినిమాలకు దూరంగా ఉంటే ఆయన ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.

బాలీవుడ్ బిజీ ఆర్టిస్టుల్లో ఒకరు అమితాబ్ బచ్చన్. కుర్ర హీరోలైనా రెస్ట్ తీసుకుంటారేమో కానీ 7 పదుల వయసులో బిగ్ బి మాత్రం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఈ ఏడాదికి గాను 7 సినిమాలున్నాయి. వీటిలో బ్రహ్మాస్త్ర లాంటి భారీ బడ్జెట్ సినిమా కూడా ఉంది. సో.. అమితాబ్ ఈ సినిమాల్ని ఏడాది పాటు పక్కనపెడతారా.. లేక కొన్ని సినిమాలు పూర్తిచేసి మరికొన్నింటిని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తారా అనేది చూడాలి.