"ఫ్యామిలీ" సీన్ అదిరింది

Amitabh, Chiranjeevi, Mohanlal, Mammotty, Ranbeer and others act in home video
Tuesday, April 7, 2020 - 16:15

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లోనే ఉందాం... కరోనాను కలిసికట్టుగా తరమికొడదాం..

దాదాపు 2 వారాల నుంచి ఈ స్లోగన్ వింటున్నాం. దీనిపై సాంగ్స్ కూడా వస్తున్నాయి. తెలుగులో చిరంజీవి, నాగార్జున, సాయితేజ్ లాంటి హీరోలు జాయింట్ గా ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడిలాంటి ప్రయోగమే బాలీవుడ్ లో కూడా జరిగింది. కాకపోతే ఈ వీడియో కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. సౌత్-నార్త్ కు చెందిన బడా స్టార్స్ అంతా ఇందులో కనిపించారు.

మినీ మూవీని తలపించే ఈ షార్ట్ ఫిలింకు ఫ్యామిలీ అనే టైటిల్ పెట్టారు. కల్యాణ్ జ్యూయెలర్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ షార్ట్ ఫిలింలో ఓ ప్రత్యేకత ఉంది. చూడ్డానికి అంతా ఒక ఇంట్లో జరిగినట్టు అనిపిస్తుంది. కానీ ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎవరి ఇంట్లో వాళ్లే ఉండి, అక్కడికక్కడ వీడియోలు తీసి పంపించారు. అంతా కలిపి చక్కటి స్క్రీన్ ప్లే, ఫ్రేమింగ్ తో దీన్నొక మినీ మూవీగా తయారుచేశాడు దర్శకుడు ప్రసూన్ పాండే.

లైటింగ్ తేడాలు, కలర్ కరెక్షన్లు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం వీడియోను బ్లాక్ అండ్ వైట్ లో ఎడిట్ చేసి వదిలారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి బిగ్ బి అమితాబ్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రణబీర్, ప్రియాంకచోప్రా, అలియా.. ఇలా చాలామంది స్టార్స్ నటించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.