దేవరకొండని తెగ పొగిడేస్తోందిగా

Ananya Panday praises Vijay Deverakonda's down to earth nature
Monday, April 6, 2020 - 17:00

విజయ్ దేవరకొండ లాంటి హీరోని చూడలేదని తెగ పొగిడేస్తోంది బాలీవుడ్ భామ అనన్య పాండే. విజయ్ దేవరకొండ సరసన అనన్య నటిస్తోంది. వీరిద్దరిని జంటగా తీసుకొని పూరి "లైగర్" అనే మూవీ తీస్తున్నారు. ఒక భారీ షెడ్యూల్ పూర్తి అయింది. "విజయ్ చాలా కామ్ గోయింగ్. అంత భారీ పాపులారిటీ ఉంది, స్టార్ డమ్ ఉంది. బట్ సింపుల్ గా ఉంటాడు. సెట్ లో నేర్చుకునే స్టూడెంట్ లా ఒద్దికగా ఉంటాడు," అని తెగ మెచ్చుకుంటోంది ఈ భామ. 

ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా దబ్ చేయనున్నారు. తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకుంటాను అంటోంది. హిందీలో విజయ్ తన డైలాగులు తానే చెప్పుకుంటాడు. అలాగే తానూ కూడా తెలుగులో చెప్తాను అంటోంది. 

చంకి పాండే కూతురు ఈ భామ. హిందీలో ఇషాన్ హీరోగా రూపొందుతోన్న మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.