వెరీ బోల్డ్ పాత్రలో అనసూయ

Anasuya to act as Tabu in Andhadhun remake?
Monday, February 24, 2020 - 19:00

టాలీవుడ్ లో రంగమ్మత్త అంటే అనసూయ. అనసూయ అంటే రంగమ్మత్త. రంగస్థలం సినిమాలో ఈ ఒక్క పాత్రతో అంతలా పాపులర్ అయిపోయింది ఈ యంకర్ కమ్ నటి. ఇంకా చెప్పాలంటే అనసూయ ఫిల్మీ కెరీర్ ను రంగస్థలానికి ముందు, రంగస్థలం తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాంటిదే మరో బ్రహ్మాండమైన ఆఫర్ అనసూయ చెంత రెడీగా ఉంది. మరి ఆమె ఓకే చెబుతుందా? రిజెక్ట్ చేస్తుందా?

నితిన్ హీరోగా అంథాదున్ రీమేక్ మొదలైంది. హిందీలో సూపర్ హిట్టయిన సినిమా ఇది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా అతడి వల్ల ఎంత పెద్ద హిట్టయిందో, అందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన టబు వల్ల కూడా అంతే హిట్టయింది. ఇప్పుడా టబు పాత్రను తెలుగులో అనసూయతో చేయించాలనుకుంటున్నారు.

Photos: అనసూయ లేటెస్ట్ స్టిల్స్ చూశారా?

నిజానికి ఇలాంటి పాత్ర రావడమే ఆలస్యం అనసూయ ఒప్పుకుంటుంది. కానీ ఇక్కడ ఆమె వెనక్కి తగ్గడానికి ఓ కారణం ఉంది. అంథాదున్ లో టబు బోల్డ్ గా నటించింది. భర్త ఉన్నప్పటికీ మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఆమెది పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం అనసూయకు కొత్త కాదు. కానీ బోల్డ్ గా నటించడం దగ్గరే చిక్కొచ్చిపడింది. టబు చేసినలాంటి బోల్డ్ సన్నివేశాలు అనసూయ రిపీట్ చేస్తుందా అనేది చూడాలి. ఈ ఒక్క విషయంలో అనసూయ కాంప్రమైజ్ అయితే, ఆమె కెరీర్ లో మరో అద్భుతమైన పాత్ర పడినట్టే.