ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోను : అనసూయ

Anasuya denies rumors about plastic surgery
Thursday, June 22, 2017 - 20:45

ఉన్నట్టుండి అనసూయ ఇలా రియాక్ట్ అయ్యేసరికి అంతా షాకయ్యారు. కాకపోతే దీనికి ఓ కారణం ఉంది. ఆమె అందాలు పెరిగిపోయాయని.. మరింత మెరుగుపరుచుకునేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీకి రెడీ అవుతోందంటూ వార్తలు వచ్చాయి. వాటిని అనసూయ ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసింది

గ్లామర్ గా కనిపించాలంటే పెరిగిన బరువును తగ్గించుకోవాలి. కానీ వ్యాయామం ద్వారా సైజు తగ్గడం సాధ్యం కావడం లేదట అనసూయకు. అందుకే ప్లాస్టిక్ సర్జరీకి రెడీ అవుతోందంటూ వార్తలు వచ్చాయి. వీటిపై అనసూయ రియాక్ట్ అయింది. తనను సంప్రదించకుండా వార్తలు రాసేస్తున్నారని, ఇష్టమొచ్చినట్టు కథనాలు అల్లేస్తున్నారని ట్వీట్ చేసింది. తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం లేదని చెబుతూనే, షార్ట్ కట్స్ తనకు నచ్చవని ట్వీట్ చేసింది అనసూయ.