ఎవడ్రా నువ్వు.. అనసూయ ఫైర్

Anasuya gives fitting reply to a troll who questioned her dressing style
Saturday, May 16, 2020 - 13:30

హాట్ యాంకర్ మరోసారి ఫైర్ అయింది. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ తో లైవ్ లో ఇంటరాక్ట్ అయిన ఈ జబర్దస్త్ బ్యూటీ.. ఆన్ లైన్లోనే ఓ వ్యక్తికి చెడామడా చీవాట్లు పెట్టింది. మంచిగా బట్టలు వేసుకో.. నువ్వు ఓ తల్లివనే విషయాన్ని మరిచిపోకు అంటూ ఓ వ్యక్తి అనసూయను ట్యాగ్ చేశాడు. దీనిపై అనసూయ ఓ రేంజ్ లో ఫైర్ అయింది.

"ఎవడ్రా నువ్వు.. నువ్వెవరు అసలు.. బర్త్ డే రోజు నాతో తిట్లు తినాలని ఉందా. ఈరోజు నీ బట్టలిప్పుతాను చూడు. ఓ తల్లి ఎలా డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెబుతావా. ఎలా దుస్తులు వేసుకోవాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ప్రతి తల్లికి హక్కు ఉంటుంది. ఓ తల్లిగా నేను ఎలాంటి బట్టలేసుకోవాలో డిసైడ్ చేయడానికి నువ్వెవడ్రా."

ఇలా ఓ రేంజ్ లో అతడ్ని తిట్టేసింది అనసూయ. నచ్చినట్టు బట్టలు వేసుకునే హక్కు తనకు ఉందని, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తనకు తెలుసని చీవాట్లు పెట్టింది. ఫైనల్ గా ఇక్కడ్నుంచి దొబ్బేయ్ అంటూ ఆ ప్రశ్నకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టింది అనసూయ.

ఇలా ఫైర్ అవ్వడం అనసూయకు కొత్త కాదు. తనను కించపరిచేలా, తన పనిని అవహేళన చేసేలా ఎవరైనా కామెంట్స్ చేస్తే అస్సలు ఊరుకోదు. సింపుల్ గా చెప్పాలంటే ఆమె హాట్ మాత్రమే కాదు, ఫైర్ కూడా.