అన‌సూయ‌ని ఇక అలా చూడ‌రా?

Anasuya happy that she shed glam tag
Tuesday, April 3, 2018 - 11:30

గ్లామ‌ర్‌కి కేరాఫ్ అన‌సూయ‌. అలాగే వివాదాల‌కి కూడా కేరాఫ్‌. ఎపుడూ ఏదో ఒక మాట అని ట్విట్ట‌ర్‌లో జ‌నంతో విమ‌ర్శ‌లను ఎదుర్కొనేది. అలాగే ఆమె అందాల ఆర‌బోత‌కి త‌ప్ప న‌ట‌న‌కి ప‌నికి రాద‌నే అభిప్రాయం ఉండేది. "క్ష‌ణం" సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసినా.. ఆమెని అంద‌రూ గ్లామ‌ర్ భామ‌గానే చూశారు. న‌టిగా ఎవ‌రూ ప‌రిగ‌ణించ‌లేదు.

ఇపుడు మాత్రం సీన్ మారింది. రంగ‌మ్మ అత్త‌గా అద‌ర‌గొట్టింది. "రంగ‌స్థ‌లం"లో ఆమె అందాల ఆర‌బోత చేయ‌లేదు. ఒక అంద‌మైన పాత్ర‌లో క‌నిపించింది. అంతేకాదు చివ‌ర్లో ఎమోష‌న్ కూడా పండించింది. ఆమెలోని న‌టిని అంద‌రూ గుర్తించారు ఇపుడు. అందుకే ఇక‌పై అన‌సూయ‌ని గ‌తంలోలా త‌క్కువ‌గా చూడ‌లేరు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యూటీగానే చూడ‌లేరు.

అన‌సూయ‌కి మ‌రిన్ని అర్ధ‌వంత‌మైన పాత్ర‌లు ద‌క్కుతాయా అనేది చూడాలి. ప్ర‌స్తుతానికైతే ఈ సినిమా ద్వారా ద‌క్కిన ప్ర‌శంస‌ల‌ను రిసీవ్ చేసుకుంటూ ఆనందంగా ఉంది అన‌సూయ‌.