దర్శకుడితో అనసూయ మందు పార్టీ?

Anasuya responds on drink party
Saturday, April 4, 2020 - 17:30

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనసూయ, టీవీ కార్యక్రమాలకు గ్యాప్ ఇచ్చినా తన ఫ్యాన్స్ కు మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. ఏదో ఒక రూపంలో వాళ్లతో టచ్ లో ఉంటూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మరోసారి ఛాట్ చేసింది ఈ జబర్దస్త్ భామ. అయితే ఛాటింగ్ అంతా ఒకెత్తయితే.. ఓ అభిమాని అడిగిన ప్రశ్న మరో ఎత్తు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో మందు పార్టీ గురించి ప్రశ్నించాడు అతగాడు.

తరుణ్ భాస్కర్ తో కలిసి డ్రింక్ చేసి రచ్చ చేశారంట కదా పార్టీలో..

ఇలా అనసూయను సూటిగా ప్రశ్నించాడు ఓ వ్యక్తి. అయితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా. అనసూయ కూడా సదరు వ్యక్తిపై బాగా సీరియస్ అయింది. "ఈ అట అనేవి మీరు మీరు సరదాకు మాట్లాడుకోవడానికి బాగుంటాయేమో. కానీ నిజాలు వేరే ఉంటాయి. నువ్వు ఎదిగితే నీకు అర్థమౌతుంది. నువ్వింకా ఎదగలేదనుకుంటా." అంటూ కాస్త ఘాటుగా సమాధానమిచ్చింది అనసూయ.

అనసూయ, తరుణ్ భాస్కర్ ది ప్రత్యేకమైన బంధం. వీళ్లిద్దరూ కలిసి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా చేశారు. ఆ సినిమాతోనే తరుణ్ భాస్కర్ హీరోగా మారాడు. అందులో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఆ టైమ్ లోనే ఇద్దరూ కలిసి మందుపార్టీ చేసుకొని రచ్చ చేశారంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. దాన్నే సదరు వ్యక్తి మళ్లీ రిపీట్ చేశాడు. అనసూయ ఖండించింది.