అనసూయ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే

Anasuya reveals her fitness secret
Tuesday, July 21, 2020 - 16:30

సెక్సీగా ఉంటుంది. పెళ్లయి ఇన్నేళ్లయినా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. ఇవన్నీ ఎలా సాధ్యం. ఇన్నేళ్లయినా అనసూయలో గ్లామర్ అంగుళమైనా ఎందుకు తగ్గలేదు. దీనికి తన ఫిట్ నెస్ కారణం అంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.

"కార్డియో వర్కవుట్స్ ఎక్కువగా చేస్తాను. షటిల్ ఆడుతాను. స్కిప్పింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తాను. వీటితో పాటు ప్రాణాయామం చేస్తాను. ఇదే నా ఫిట్ నెస్ సీక్రెట్."

వర్కవుట్ అంటే జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేయడం, బరువులు ఎత్తడం లాంటివి తనకు తెలియదంటోంది అనసూయ. జీవితంలో ఒకే ఒక్క సారి అలాంటి పని చేసిందట. బాహుబలి హీరోలకు (ప్రభాస్, రానా) కోచింగ్ ఇచ్చిన ఫారిన్ ట్రయినర్ డానియల్ నేతృత్వంలో ఓ వారం రోజులు వర్కవుట్ ప్రొగ్రామ్ చేసిందట. దాంతో తలప్రాణం తోకకొచ్చి,.. అప్పట్నుంచి వెయిట్స్ కు దూరంగా ఉంటోందట.