ఎఫ్2లో అన‌సూయ‌ ఎచ్‌2

Anasuya's special song in F2
Wednesday, December 5, 2018 - 10:45

అన‌సూయ మ‌రోసారి ఐటెంసాంగ్ చేయ‌నుంది. సాయి ధ‌ర‌మ్ తేజ న‌టించిన ఓ సినిమాలో ఐటెంసాంగ్ చేసి బ్యాడ్‌నేమ్ తెచ్చుకొంది అన‌సూయ‌. ఇక‌పై ఇలాంటి సాంగ్స్‌లో న‌టించ‌న‌ని చెప్పింది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మత్త పాత్ర‌తో న‌టిగా గుర్తింపు రావ‌డంతో సెక్సీ సాంగ్స్‌కి దూరంగా ఉంటాన‌ని మాట ఇచ్చింది. ఐతే ఆమె ఇపుడు మ‌న‌సు మార్చుకున్న‌ట్లు ఉంది.

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ హీరోలుగా దిల్‌రాజు నిర్మిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ "F2" సినిమాలో అన‌సూయ హాట్ అండ్ హాట్ (ఎచ్‌2) సాంగ్‌ని తీస్తున్నార‌ట‌. ఈ పాట చేసేందుకు మంచి పారితోషికం ద‌క్కుతుండ‌డంతో అన‌సూయ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.

అన‌సూయ ఈ పాట‌తో పాటు ప‌లు కొత్త సినిమాలు అంగీక‌రించింది. ఇపుడు ఆమెకి గ్లామ‌ర్ రోల్స్ క‌న్నా అభిన‌యానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లే ద‌క్కుతుండ‌డం విశేషం. జ‌బ‌ర్‌ద‌స్త్ యాంక‌ర్‌గా పాపుల‌ర‌యిన అన‌సూయ‌... సినిమా రంగంలో స‌క్సెస్ అయింది. మిగ‌తా యాంక‌ర్లు ఎవ‌రూ పెద్ద‌గా కెరియ‌ర్‌ని కొన‌సాగించ‌లేదు కానీ అన‌సూయ‌కి మాత్రం సినిమాల్లోనూ క్రేజ్ ద‌క్కింది.