'అంధ‌గాడు' పాటల సంద‌డి

Andhagadu audio songs are out
Tuesday, May 9, 2017 - 15:45

రాజ్‌త‌రుణ్ హీరోగా రూపొందుతోన్న కొత్త‌ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం ఆడోర‌కం త‌ర్వాత‌ రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది. టైటిల్‌లోనే హీరో క్యార‌క్ట‌ర్ ఏంటో చెప్పేశారు. అదేనండి..సినిమాలో హీరోకి క‌ళ్లు క‌న‌ప‌డ‌వు. 

ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.  డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌  సినిమాకు వ‌న్ ఆఫ్ ది హైలైట్ కానుంద‌ని టీమ్ చెపుతోంది.  సోష‌ల్ మీడియాలో, ఎఫ్‌.ఎం. స్టేష‌న్స్‌లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈరోజు నుండి ఒక్కొక్క సాంగ్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

రాజ్ త‌రుణ్‌, హెబ్బా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అన్న పుకార్ల సంగ‌తెలా ఉన్నా.. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగుంటుంద‌ని ప్రేక్ష‌కులు ఇప్ప‌టికే రెండు సినిమాల్లో తీర్మానించారు. మ‌రి మూడో సినిమాలోనూ వీరి కెమిస్ట్రీ  వ‌ర్క‌వుట‌యి ...నిర్మాత‌కి ఎకనామిక్స్ వ‌ర్క‌వ‌ట్ చేస్తుందా అనేది చూడాలి.